NRPT: బీఆర్ఎస్ యువ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం మూర్ఖత్వమని మక్తల్ బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు చిన్న హన్మంతు మంగళవారం మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా ప్రశ్నించే గొంతులను అణచివేస్తోందని విమర్శిస్తూ, వెంటనే నేతలను విడుదల చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.