AKP: ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు భూములు ఇచ్చిన నిర్వాసితుల త్యాగాలను తక్కువ చేసి మాట్లాడారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం అప్పలరాజు విమర్శించారు. చందనాడలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తరతరాలుగా వారసత్వంగా వస్తున్న భూములను నిర్వాసితుల నుంచి తక్కువ రేట్లకు ప్రభుత్వం తీసుకుందన్నారు.