TG: నకిలీ వైద్యం చేస్తున్న డెంటిస్ట్ గుట్టురట్టు అయ్యింది. యూపీకి చెందిన రమేష్ అనే వ్యక్తి దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఉపాధి కోసం HYDకి వచ్చాడు. పదో తరగతి కూడా చదవకుండా నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్‌గా అవతారమెత్తాడు. నేరేడ్మెట్ పరిధిలో ఒక డెంటల్ క్లినిక్ ఏర్పాటు చేసి వైద్యం చేస్తున్నాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.