NGKL: పశువులకు సోకే గాలికుంటు వ్యాధి (FMD) నివారణలో భాగంగా మంగళవారం ఊర్కొండ మండలంలోని ముచర్లపల్లి గ్రామంలో ఉచిత టీకా కార్యక్రమం నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ అధికారుల ఆధ్వర్యంలో గ్రామంలోని 148 పశువులకు టీకాలు వేశారు. అధికారులు మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల సమయంలో వ్యాధి సోకే అవకాశం ఉందని, అందుకే ముందుస్తుగా టీకాలు వేయించుకోవాలని సూచించారు.