JGL: సారంగాపూర్ మండలం రంగాపేట గ్రామానికి చెందిన లత, రాజేశం కుటుంబం నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం పేదలకు గృహ వసతి కల్పించేందుకు చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం సఫలీకృతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్ శేఖర్ యాదవ్, ఉపసర్పంచ్, ఎంపీడీవో, డీఈ హౌసింగ్ పాల్గొన్నారు.