MBNR: ఉమ్మడి జిల్లా న్యాయవాదుల పోరాట ఫలితంగానే న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పడిందని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. న్యాయవాదుల రక్షణ చట్టం రూపు దాల్చడంలో సహకరించిన ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.