SDPT: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రామ్మూర్తికి వినతి పత్రాన్ని అందించారు. ఆరు గ్యారెంటీల్లో ఒక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా హామీలకు మంగళం పాడిందని అన్నారు.