అక్షయ్ కుమార్ తన రాబోయే హారర్ కామెడీ మూవీ ‘భూత్ బంగ్లా’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ధురంధర్ 2’ ప్రభంజనం సృష్టిస్తోన్న సమయంలో తను హారర్ కామెడీతో రావడంపై స్పందించాడు. ‘ధురంధర్ 2 అద్భుతమైన మూవీ, కానీ అది పెద్దల కోసం తీసింది. భూత్ బంగ్లా మాత్రం పిల్లలు, కుటుంబ సభ్యులందరూ కలిసి చూసేలా ఉంటుంది. కేవలం ట్రెండ్‌ను ఫాలో అవ్వకుండా, కథా బలంతోనే ఈ మూవీ తీశాం’ అని అన్నాడు.