JN: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగాకలిశారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులు, ప్రజల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి ముఖ్యమంత్రితో చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని కోరారు.