NRPT: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నాలుగు నెలలుగా ఫిజియోథెరపీ సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కీళ్ల నొప్పులు, పక్షవాతం వంటి సమస్యలతో వచ్చే బాధితులు చికిత్స అందక వెనుదిరుగుతున్నారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతోనే సేవలు ఆగిపోయాయని సిబ్బంది చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు.