KRNL: నేర నియంత్రణలో రాజీ పడకుండా నేర నివారణే ప్రథమ లక్ష్యంగా పని చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో నేర నియంత్రణను కట్టుదిట్టం చేయాలన్నారు. రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలని తెలిపారు.