SRD: సదాశివపేట బైపాస్ ఎంకేపల్లి శివారులోని 65వ జాతీయ రహదారిపై మంగళవారం ప్రమాదం జరిగింది. సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వైపు బైక్పై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.