RR: శేరిలింగంపల్లి నియోజకవర్గం మాతృశ్రీ నగర్ డివిజన్ పరిధిలోని మాతృశ్రీ నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని స్థానిక ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్‌ను సాదరంగా ఆహ్వానించారు.