సినిమా విజయానికి నిడివి కంటే కంటెంట్ ముఖ్యం అని ‘యానిమల్’, ‘పుష్ప-2’, ‘ధురంధర్’ చిత్రాలు నిరూపించాయి. 3 గంటలకుపైగా నిడివి ఉన్నా, ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారంటే కారణం బలమైన కథనం. రొటీన్ ఫార్ములాలు కాకుండా, ఎమోషన్స్, ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లేతో వస్తే నిడివి అడ్డంకి కాదని, కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఎన్ని గంటలైనా థియేటర్లో కూర్చుంటారని ఈ మూవీలు నిరూపించాయి.