AKP: పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు. అనంతరం అడ్డరోడ్డు జంక్షన్ ఆర్డీవో కార్యాలయంలో వినత పత్రం అందజేశారు.