SDPT: బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఇవాళ అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. ఈవో శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉత్సవాలు మార్చి 25 నుంచి ఏప్రిల్ 9 వరకు జరుగనున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం విద్యుత్, శుభ్రత, తాగునీరు, వైద్య, భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో ఛైర్మన్ జెల్ల ప్రభాకర్, సర్పంచ్ బొల్లం శ్రీధర్, అధికారులు ఉన్నారు.