TG: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్ప సారా వ్యాఖ్యలపై తనను ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. అవగాహన లేకుండా తాను మాట్లాడలేదని వెల్లడించారు. ఇప్ప పువ్వు సారా విధానంపై రేపు సభలో మాట్లాడుతానని, ట్రోల్ చేసేవాళ్లు తన స్పీచ్ వినాలని సూచించారు. ట్రోలింగ్ చేసేవారికి రేపు సమాధానం దొరుకుతుందని అన్నారు.