ASF: ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హరిత మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. వైద్య సేవల అమలు తీరుపై సమీక్షించారు. ఓపీ రిజిస్టర్, హాజరు పుస్తకాలు, ఔషధ నిల్వలు, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని ఆమె స్పష్టం చేశారు.