SRD: గుమ్మడిదల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం సందర్శించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలును సమీక్షించారు. ఓపీ రిజిస్ట్రేషన్, ల్యాబ్ పరీక్షలు, మందుల పంపిణీ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే విధానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. నాగ నిర్మల, డా. మధుకర్, ఎమ్మార్వో పరమేష్ ఉన్నారు.