MDK: తూప్రాన్ పోలీసులు “చలో అసెంబ్లీ” నేపథ్యంలో బీఆర్ఎస్వి నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. 15% విద్యానిధులు, 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, స్కాలర్ షిప్ విడుదల తదితర అంశాలపై చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. చలో అసెంబ్లీ నేపథ్యంలో తూప్రాన్ మున్సిపల్ బీఆర్ఎస్వి అధ్యక్షులు నాని వెంకట్, యూత్ అధ్యక్షులు శ్రీకాంత్ తదితరులను అరెస్టు చేశారు.