VSP: ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన భారీ KFC చికెన్ బకెట్ సైకత శిల్పం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. నగరంలో కేఎఫ్సీ 14వ బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి ఆకునూరు బాలాజీ వరప్రసాద్ రెండు రోజుల పాటు శ్రమించి ఈ కళాఖండాన్ని రూపొందించారు. ఈ శిల్పం వద్ద పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.