KDP: పులివెందులో ఉద్యోగ సంఘాలు మంగళవారం మినీ సెక్రటేరియట్ ఎదుట నిరాహార దీక్ష నిర్వహించారు. 12వ పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, ఆర్థిక బకాయిల చెల్లింపుల కోసం యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ బాబు నేతృత్వంలో దీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంటనే పీఆర్సీ అమలు చేసి పెండింగ్ బకాయిలు, మెడికల్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.