KRNL: ఎమ్మిగనూరులోని గుడికల్ చెరువు నీరు తీవ్రంగా కలుషితమైందని బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్ర ఇవాళ ఆరోపించారు. మురుగు, రసాయన వ్యర్థాల వల్ల చేపలు మృత్యువాత పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 10 రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే నిరసనలు చేపడతామన్నారు.