W.G: ఆకివీడు పట్టణ శివారు దుంపగడప రైల్వే గేట్ సమీపంలోని శ్రీ రాజరాజేశ్వరి సహిత మార్కండేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం ప్రతిష్ఠాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం జరగనున్న శ్రీ దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని, ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా గోపూజ నిర్వహించారు.