TG: అసెంబ్లీలో BJLP నేత మహేశ్వర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు మధ్య మాటల యుద్ధం నెలకొంది. మోసపూరిత, చీటింగ్ బడ్జెట్ అంటూ BJLP నేత వ్యాఖ్యానించారు. చీటింగ్ బడ్జెట్ అనడంపై మంత్రి ఆగ్రహించారు. బడ్జెట్‌పై అనుచిత వ్యాఖ్యలు తగదని సూచించారు. మహేశ్వర్ రెడ్డి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ తెలిపారు.