MNCL: గ్రామాలలో సమస్యల పరిష్కారానికి బీజేపీ కృషి చేస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పార్టీ బలపరిచిన అభ్యర్థిని సర్పంచ్‌గా గెలిపించడంతో మంగళవారం దండేపల్లి మండలంలోని నాగసముద్రంలో బోరును వేయించి మోటారును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నందుర్క సుగుణ, ఉప సర్పంచ్ పుదారి రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.