VZM: జనాభా గణన శిక్షణ కార్యక్రమంలో ప్రతి అంశాన్ని అవగాహన చేసుకుని, సందేహాలను నివృత్తి చేసుకోవాలని రాష్ట్ర జనాభా గణన ఆపరేషన్ సంచాలకులు జె. నివాస్ తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నేటి నుంచి నాలుగురోజులపాటు నిర్వహిస్తున్న రెండో విడత క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనాభా గణన అవశ్యకతను వివరించారు.