కృష్ణా: ప్రధాన రహదారుల నిర్మాణం నాణ్యతా ప్రమాణాలతో జరుగుతోందని క్వాలిటీ కంట్రోల్ ఏఈ బాషా తెలిపారు. గురువారం చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ రామానగరంలో రూ.45లక్షలతో నిర్మిస్తున్న తారు రోడ్డు నాణ్యత తనిఖీ చేశారు. రోడ్డు నిర్మాణంలో వినియోగించిన మెటీరియల్ శాతం నిబంధనలకు అనుగుణంగా ఉందని తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖ డీఈ సురేష్ బాబు, ఏఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.