SRD: సదాశివపేట బైపాస్ రోడ్డులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఎన్ ఫుడ్ కోర్ట్ సమీపంలో స్కూటీపై వెళ్తున్న ఓ యువకుడిని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో యువకుడు వాహనం కింద చిక్కుకోగా, డ్రైవర్ ఆపకుండా సుమారు అర కిలోమీటరు దూరం ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ అమానుష ఘటనలో తీవ్ర గాయాలైన యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.