CTR: ఎస్ఆర్ పురంలో పదవ తరగతి విద్యార్థి రాజు పూరి గుడిసెలో ఉంటూ పరీక్షలకు హాజరవుతున్నాడు. కుటుంబ పోషణ కోసం పరీక్ష ముగిసిన వెంటనే చికెన్ షాప్‌కు వెళ్తున్నాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై సుమన్ ఉపాధ్యాయుల ద్వారా గురువారం నిత్యావసర సరుకులు అందజేశారు. బాల కార్మిక చట్టం ప్రకారం చిన్నారులను పనులలో పెట్టుకోరాదని ఆయన హెచ్చరించారు.