PLD: ఈపూరు ఏపీ మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ప్రిన్సిపల్ పద్మజ కోరారు. పదవ తరగతి మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారన్నారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులు ఉన్నాయన్నారు.