ASR: అనంతగిరి గ్రామ పంచాయతీలో గురువారం జరిగిన గ్రామసభలో నిధుల వినియోగంపై తీవ్ర చర్చ నెలకొంది. జనసేన మండల అధ్యక్షుడు చిట్టం మురళి 124 కోట్లు ఎక్కడ ఖర్చయ్యాయి? అభివృద్ధి పనులు ఎక్కడ? అని ప్రశ్నించడంతో సభలో ఉద్రిక్తత ఏర్పడింది. సర్పంచ్, సీపీఎం నాయకులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.