సత్యసాయి: పెనుకొండ బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం ఏకగ్రీవంగా జరిగాయి. మార్చి 16న నోటిఫికేషన్ జారీ చేయగా, 26 వరకు ఇతర నామినేషన్లు లేకపోవడంతో నామినేషన్లు వేసిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ డి. నాగరాజు ప్రకటించారు. ప్రెసిడెంట్గా వి. శ్రీనివాసులు, వైస్ ప్రెసిడెంట్గా జి. లక్ష్మీనారాయణ, కార్యదర్శిగా అశ్వర్థ నారాయణ ఎన్నికయ్యారు.