PPM: అకాల వర్షాలకు నష్టపోయిన రైతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వంగల దళినాయుడు డిమాండ్ చేశారు. కొమరాడ మండలం గుమ్మడ గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను గురువారం పరిశీలించారు. పంట చేతికి వచ్చే సమయంలో లక్షలాది రూపాయలు నష్ట పోయారని, అధికారులు స్పందించాలని రైతులు కోరారు.