E.G: రాజమండ్రిలోని కంబాల చెరువు సమీపంలో ఉన్న INDANE గౌతమి గ్యాస్ ఏజెన్సీని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం తనిఖీ చేశారు. ఈ మేరకు వినియోగదారులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఎటువంటి జాప్యం జరగకూడదన్నారు. అలాగే తూకంలో తేడాలు లేకుండా చూడాలని నిర్వాహకులను ఆయన ఆదేశించారు.