AKP: ఎలమంచిలి మున్సిపాలిటీకి చెల్లించాల్సిన ఆస్తి, ఖాళీ స్థలం పన్నులు ఏకకాలంలో చెల్లిస్తే వడ్డీలో 50 శాతం రాయితీ లభిస్తుందని మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశం ఈనెల 31వ తేదీ వరకే ఉంటుందన్నారు. పుర ప్రజలు పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.