సూర్యాపేటలో ట్రాఫిక్ నిబంధనలపై డ్రైవర్లకు విస్తృత అవగాహన కల్పించారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా కొత్త బస్టాండ్ ఆటో స్టాండ్ వద్ద ‘Arrive – Alive’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వెంకట్ మాట్లాడుతూ.. రహదారి నిబంధనలు పాటించడం వల్ల ప్రాణాపాయం తప్పుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని అన్నారు.