WGL: విద్యాసంస్థల బంద్ సంపూర్ణంగా జరిగిందని పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి గుర్రం అజయ్ తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం నర్సంపేట పట్టణ కేంద్రంలోని కళాశాలలు బంద్ నిర్వహించినట్లు చెప్పారు. పెండింగ్లో ఉన్న రూ.10,000 కోట్ల స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.