SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ మాదారం గ్రామంలో పంచముఖ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన, శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. రామాలయం, పంచముఖ హనుమాన్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గంలో భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించనున్నారు.