NRPT: ఇటీవల పాలమూరు యూనివర్సిటీ ప్రకటించిన మొదటి సెమిస్టర్ రివల్యూషన్ ఫలితాలలో మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల యంపీసీయస్ విద్యార్థిని కె. అపూర్వ 9.84 గ్రేడ్‌తో నారాయణపేట జిల్లాలోనే మొదటి ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా అపూర్వని కళాశాల ప్రిన్సిపల్ ఈ.నారాయణ గౌడ్, అధ్యాపక బృందం శాలువాతో సన్మానించి, ప్రత్యేకంగా అభినందించారు.