TG: హైదరాబాద్లోని బండ్లగూడలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా వ్యవహరిస్తున్న కొంతమంది ముఠా.. ముందుగా ఇళ్లను అద్దెకు తీసుకుంటుంది. అనంతరం.. దానిని సొంత ఇళ్లుగా చూపించి.. నకిలీ పత్రాలతో అమ్మకానికి పెడుతుంది. దీంతో కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేసి.. అక్కడి నుంచి పరారవుతుంది. ఇలాంటి ఘటన బండ్లగూడలో జరిగింది.