MDK: మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన 12 మొబైల్ ఫోన్లను పోలీసులు బాధితులకు అందజేశారు. CEIR పోర్టల్ సాయంతో వీటిని రికవరీ చేసినట్లు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. ఆధునిక సాంకేతికతను వాడుతూ పోగొట్టుకున్న ఆస్తులను తిరిగి అప్పగించడంలో పోలీసులు ముందుంటారని ఆయన పేర్కొన్నారు. తమ ఫోన్లు తిరిగి రావడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.