NZB: శ్రీరామ నవమి సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేయనున్నారు. తన మెట్టినిల్లు అయిన నిజామాబాద్ వేదికగా ఆమె చేయనున్న ప్రకటనపై ఆసక్తి నెలకొంది. నిజామాబాద్ జాగృతి కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. అంతకు ముందు శ్రీ రఘునాథ ఆలయం (ఖిల్లా రాంమందిర్) లో జరిగే శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొంటారు.