KMM: వైరా కేంద్రలో పదేళ్ల క్రితం ప్రారంభించిన గిరిజన భవన నిర్మాణం నేటికీ అసంపూర్తిగానే ఉందని, దీనిని వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. వైరా పర్యటనకు వచ్చిన అ.కలెక్టర్ శ్రీజను సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరభద్రం కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించాలని కోరారు.