NLG: దేవరకొండ ఆర్టీసీ డిపో నుంచి నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలం శిరసనగండ్ల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి జాతర సందర్భంగా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ విజయకుమారి తెలిపారు. శుక్రవారం శ్రీరామనవమి స్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా దేవరకొండ, డిండి బస్ స్టేషన్ల నుంచి ప్రయాణికుల రద్దీ కనుగుణంగా బస్సులు నడపనున్నట్లు తెలిపారు.