GNTR: జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న సాధకులతో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గుంటూరు జిల్లాలో ప్రథమ స్థానాన్ని సాధించడంతో పాటు రాష్ట్ర స్థాయిలో టాప్-5లో నిలిచేలా కృషి చేసిన సాధకులందరికీ అభినందనలు తెలిపారు.