పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో బహ్రెయిన్‌లోని తమ వెబ్ సర్వీసెస్‌లో అంతరాయం ఏర్పడినట్లు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పేర్కొంది. ఆ ప్రాంతంలో డ్రోన్ కార్యకలాపాల వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు అమెజాన్ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఘటన కారణంగా ఎంత నష్టం జరిగింది, ఎన్ని రోజులపాటు అంతరాయం కొనసాగనుందనే వివరాలను అమెజాన్ వెల్లడించలేదు.