VKB: కుల్కచర్లలో లోవోల్టేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామన్న ప్రజల ఫిర్యాదు మేరకు అధికారులు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు కరెంటు స్తంభాలు ఏర్పాటు చేశారు. స్తంభాలు వేసి సరిపెట్టారని పనులు ముందుకు సాగడంలేదని, సమస్య అలాగే ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.