వరంగల్ నగరంలో సోమవారం రాత్రి నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 41 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 36 మందిని, లైసెన్స్ లేకుండా నడిపిన మరో 5 మందిని పోలీసులు పట్టుకున్నారు. నిందితులకు కోర్టు జరిమానా విధించడంతో పాటు కౌన్సెలింగ్ ఇచ్చారు. నిబంధనలు పాటించని వారిపై వాహనాలు సీజ్ చేస్తామని పోలీసులు తెలిపారు.