NLG: ఖమ్మం జిల్లా కుసుమంచి బైపాస్ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదంలో మునుగోడు మండలం పలివెలకు చెందిన గోస్కొండ పృథ్వీ(24) మృతి చెందాడు. హయత్నగర్ నుంచి ఖమ్మంకు వెళ్తున్న కారు కుసుమంచి వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టింది. తీవ్ర గాయాల కారణంగా పృథ్వీ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మృతుడి స్వగ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.